ప్రపంచానికి గుడ్ న్యూస్; జాన్సన్&జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తెచ్చేస్తుంది…!

-

ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కి మందు కనుక్కోవడానికి గానూ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ముందుకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే ఆ కంపెనీతో అమెరికా ప్రభుత్వం భారీ డీల్ కుదుర్చుకుంది. 3 వేల 438 కోట్ల డీల్ ని అమెరికా ప్రభుత్వంతో ఈ సంస్థ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అమెరికాకు ప్రభుత్వం ఆధీనంలో పని చేసే బయోమెడికల్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(బార్డా) సంతకం చేసాయి.

ఈ ఒప్పందంలో భాగంగానే వచ్చే ఏడాది మార్చ్ లోగా… 100 కోట్ల డోసుల కరోనా (కోవిడ్ 19) వ్యాక్సిన్‌ ను అక్కడి ప్రభుత్వానికి అందించడానికి జాన్సన్‌&జాన్సన్‌ సిద్దమైంది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ని తయారు చేయడానికి గానూ… ఆ కంపెనీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టి 3 వేల కోట్లకు పైగా నిధులను కూడా కేటాయించింది. ఇప్పుడు మళ్ళీ అమెరికాతో భారీ ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ.

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మానవులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగ పరిక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది మార్చ్ కి ఇది బహిరంగ మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రకటించింది. తాము ఇప్పటికే పరిక్షలు చేస్తున్న లీడ్ క్యాండిడేట్ ఉత్తమ ఫలితాలు ఇస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా సదుపాయాలను, మానవ వనరులను అందించడానికి బార్దా నిధులు కూడా కేటాయించింది.

జాన్సన్ & జాన్సన్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ గోర్స్కీ మాట్లాడుతూ, “ప్రపంచం అత్యవసర ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. COVID-19 వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి మరియు సరసమైన ధరలకు అందించడానికి మా వంతు కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయండని ఆయన కోరారు. 20 సంవత్సరాలకు పైగా, జాన్సన్ & జాన్సన్ యాంటీవైరల్స్ మరియు టీకా సామర్థ్యాలలో బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version