దేశంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలోని బీజేపీ పాలనను సాగిస్తోంది, కానీ ప్రజలు కొన్ని పార్టీలు మోదీ ప్రభుత్వంపై సుముఖంగా లేరు. అందుకే రానున్న లోక్ సభ ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగిన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విషయాన్నీ అంచనా వేసిన మోదీ ప్రభుత్వం అందుకు తగిన రిపేర్ లను చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 18వ తేదీన ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీల ముఖ్యనేతలతో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సమావేశానికి హాజరు కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లోక్ జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖపై స్పందించిన చిరాగ్ పాశ్వాన్ ఈ మీటింగ్ కు హాజరు అవ్వాలో లేదో అదే విధంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో అధికార కూటమితో పొత్తులను పెట్టుకోవాలో లేదో అన్న విషయం మా పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో సమావేశం అయ్యి చర్చించిన తర్వాతే మీకు మా నిర్ణయాన్ని తెలియచేస్తామని రిప్లై ఇచ్చారు.
దీనిని బట్టి చిరాగ్ పాశ్వాన్ మీటింగ్ కు వెళ్ళడానికి సుముఖంగా లేరని అర్దమ్బవుతోంది. మరి ఈ విషయాన్నీ అధికారికంగా తెలిపే వరకు చూడాలి.