బిజెపి ఎమ్మెల్యే కు వార్నింగ్.. ఇచ్చింది ఎవరో కాదు..?

-

ఇటీవలే ఉత్తరప్రదేశ్లో సంచలన ఘటన జరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీ అయిన బిజెపికి చెందిన ఎమ్మెల్యే అనుచరుడు ఏకంగా పోలీసుల కళ్ల ఎదుటే ఓ వ్యక్తి పై కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించింది ఇక ఆ తర్వాత తన అనుచరుడు చేసిన పనిని బిజెపి ఎమ్మెల్యే సమర్థించడం మరింత విమర్శలకు తావిచ్చింది, ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ రాజకీయ మొత్తం ఒక్కసారిగా వేడెక్కిన విషయం తెలిసిందే. అయితే పూర్తి సమాచారాన్ని తెలుసుకొని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.

ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో బిజెపి ఎమ్మెల్యే సురేందర్ సింగ్ అనుచరుడు వ్యవహరించిన తీరు ఆ తర్వాత సురేందర్ సింగ్ మద్దతు ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనపై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు… బిజెపి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ను ఈ ఘటనకు దూరంగా ఉండేలా చూడాలని యూపీ బీజేపీకి ఆదేశించారు జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.

Read more RELATED
Recommended to you

Latest news