Jr NTR Warning to Minister Konda Surekha on Samantha: సమంత, నాగచైతన్య విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండ సురేఖ మాట్లాడడం పై… చాలామంది భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకమై కొండా సురేఖను.. ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ నేపద్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఉంటే టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు కూడా కూర్చొని ఉండలేమని… భరతం పడతామని పరోక్షంగా హెచ్చరించారు జూనియర్ ఎన్టీఆర్. సెలబ్రిటీల పర్సనల్ విషయాలు రాజకీయాలలోకి లాగకూడదని కోరారు. మీరు మీ రాజకీయాలు చూసుకోవాలి కానీ సెలబ్రిటీలను లాగి… చాలా పెద్ద తప్పు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్ ఇండస్ట్రీ అస్సలు సహించ బోధని… మండిపడ్డారు జూనియర్ ఎన్టీఆర్. దీనిపై క్షమాపణలు చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు.
https://x.com/tarak9999/status/1841571689982730392