ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త..జంబ్లింగ్‌ విధానం రద్దు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలలో జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకువచ్చిన నోటిఫికేషన్ ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పిటిషన్ దాఖలు కాగా.. ఆ పిటిషన్పై ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానాన్ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దీంతో పాత విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని కోర్టు తీర్పులో పేర్కొంది. ఇక కోర్టు తీర్పు ప్రకారం ఏపీ ఇంటర్ విద్యార్థులు తాము చదివే కాలేజీలోనే ప్రాక్టికల్స్ రాసుకునేందుకు అవకాశం కలిగింది. ఈ విధానం ఎంతో ఏపీ విద్యార్థులకు కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ పరీక్ష నేపథ్యంలో ఏప్రిల్ 22 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news