జూన్ 28 మంగళ వారం ఏ రాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మేషం: పనుల్లో ఆటంకాలు.. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి..కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక ప్రగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కర్కాటకం: ఈరోజు శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు అందుతాయి. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.ఆకస్మిక ధన లాభం.
సింహం: మొండి బాకాయిలు అందుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి..దైవదర్శనాలు.
కన్య: బంధువులతో వివాదాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం..సమాజంలో గౌరవం పెరుగుతుంది..
తుల: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం: కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కార్యజయం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మంచి రోజు..
ధనుస్సు: రుణబాధలు తొలగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి..ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభాలు..
మకరం: కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.కొత్త వ్యాపారాలు ఆశాజనకంగా ఉండవు..
కుంభం: ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. ఆస్తుల కొనుగోలు వాయిదా. పనులలో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.బంధువులతో జాగ్రత్తగా ఉండాలి.
మీనం: బంధువుల నుండి ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు..కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి..