“ఐరన్ మ్యాన్” గా రానున్న జూనియర్ ఎన్టీఆర్ ?

-

టాలీవుడ్ అభిరుచి కలిగిన అతి కొద్దిమంది నిర్మాతలలో నాగవంశీ ఒకరని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నాకు హాలీవుడ్ సినిమాలు అన్నా , ముఖ్యంగా సూపర్ హీరోలంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇంకా నా మనసులో ఐరన్ మ్యాన్ లాంటి సినిమాను నిర్మించాలని కోరికగా ఉందన్నారు.. కానీ ఇలాంటి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ అయితే సరిగ్గా సూట్ అవుతారని చెప్పడం జరిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఐరన్ మ్యాన్ లాంటి సూపర్ హీరో సినిమాను నిర్మిస్తానని నిర్మాత నాగవంశీ చెప్పారు. కానీ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర మూవీతో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వార్ సీక్వెల్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నాడు.

ఇవి రెండూ పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మరి నాగవంశీ చెప్పినట్లుగా ఐరన్ మ్యాన్ లాంటి సినిమాను తారక్ తీస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news