ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట త్వరలో వివాహం జరగనుంది. ఆగస్టు 12న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి, అర్జున్ రెడ్డి వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట జరిగిన స్వప్ని రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి. స్వప్ని రెడ్డి, అర్జున్ రెడ్డి లకు ఎన్టీఆర్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిశ్చితార్థానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నటీనటులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
అయితే రెండేళ్ల కిందట పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాహం ఘనంగా జరిగింది.అప్పుడు ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్స్ వద్ద భారీ బహుబలి సెట్టింగ్ లు వేసి వేడుక నిర్వహించారు. అయితే ఇప్పుడు కుమార్తె పెళ్లి ఎంత ఘనంగా నిర్వహిస్తారు అనే చర్చ ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణలోనే కాక ఏపీ లోను మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆయన కుమార్తె పెళ్లికి భారీగా అభిమానులు తరలి తరలివస్తారని పొంగులేటి అనుచరులు చెబుతున్నారు.