తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరికీ గుండెల్లో దడదడలాడుతోంది. ఈ ఎన్నికల్లో గెలువకుంటే జీవితాలే తారుమారు అవుతాయన్నట్లుగా అన్ని పార్టీలు పోటీ పడి మరీ ప్రచారంలో పాల్గొంటూ ప్రజలను ప్రసన్న చేసుకునే పనిలో ఉన్నాయి. ఇక బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇప్పుడు బీఎస్పీ లు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ప్రజల్లో బలహీనంగా మార్చే ప్రణాళికలో ఉన్నాయి. కాళేశ్వరంగ్ ప్రాజెక్టు విషయంపై బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ చెయ్యి ఉందంటూ ఆరోపణలు చేశారు ప్రవీణ్ కుమార్. ఇక ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కృంగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం పైన కూడా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు..
ఈ బ్యారేజీ కృంగిపోవడానికి ప్రధాన కారణం ప్రాజెక్ట్ లో కమిషన్ ల కోసం కాకృతి పడడమే అంటూ ప్రవీణ్ కుమార్ అసలు విషయాన్ని బట్టబయలు చేశారు. ముఖ్యంగా NSDA కు అసలైన రిపోర్ట్స్ ఇవ్వకపోవడమే అనుమానాన్ని వ్యక్తం చేశారు ప్రవీణ్ కుమార్.