చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నారు. ఈ విషయంపై న పొలిటికల్, మూవీ సర్కిల్ లో చంద్రబాబు కు మద్దతుగా చాలామంది స్పందించిన మాట వాస్తవమే. కానీ ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ స్పందలేదని అంటున్నారు. ఈ విషయంపైన పొలిటికల్ గా కొందరు ఎన్టీఆర్ ను విమర్శిస్తూ వస్తున్నారు. అయినప్పటికి ఎన్టీఆర్ పన్నెత్తి మాట కూడా అనకుండా తన పనేమిటో చూసుకుంటున్నాడు. అయితే తాజాగా పల్నాడు జిల్లా వెల్లటూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. ఈ ఫ్లెక్సీ సారాంశం చూస్తే .. ఒక మనిషి మౌనం వెనుక చాలా కారణాలు ఉంటాయి, ఛాన్స్ దొరికితే బురద చల్లడానికి రెడీ గా ఉంటారు… మాట్లాడలేదంటారు, మాట్లాడితే నోటికి వచ్చినట్లు వాడుతారు..
దయచేసి ఇకనైనా మీరు ఎన్టీఆర్ గురించి మొరగడం తగ్గించుకుంటే మంచిది, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన్ను రాజకీయాల్లోకి లాగకండి అంటూ క్లాసిక్ వార్నింగ్ ఇచ్చారు.