ఫ్యామిలీ ఫోటో పోస్ట్ చేసిన ఎన్టీఆర్, రచ్చ రచ్చే…!

-

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలుకు, అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా భార్య లక్ష్మి ప్రణతి, కుమారులు అభయ్ రామ్ ,భార్గవ్ రామ్ లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి అందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈఫోటో నందమూరి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. వారసులు వచ్చారు అని కొందరు,

అన్న ఎప్పుడు వస్తావ్ అంటూ సోషల్ మీడియా లో కామెంట్లు చేసి తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం తారక్ రాజమోళి దర్శకత్వంలో రాంచరణ్ తో కలిసి ‘ఆర్ ఆర్ ఆర్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా వస్తుండగా… ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరిస్ నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version