17 మంది ఎమ్మెల్యేలు జంప్…!

-

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత జ్యోతి రాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. ఆయన వర్గంలో ఉన్న 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండటంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఎం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసారు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ సభ్యులు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. బీజేపీ 107 మందితోపాటూ 17 మంది మద్దతు పొందితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు.

ఉప ఎన్నికలకు బిజెపి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సింధియాకు బీజేపీ రాజ్యసభ సీటును ఎరవేసినట్లు సమాచారం. అలాగే కేంద్ర మంత్రిని కూడా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిజెపి సీనియర్ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. దీనితో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version