పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ మల్లు రవి కి మద్దతుగా నిలుస్తున్నారు జూపల్లి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
చెట్టెక్కిన మంత్రి జూపల్లి..
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కోసం చెట్టెక్కి ప్రచారం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. pic.twitter.com/wf3L4HiSg1
— Telugu Scribe (@TeluguScribe) April 20, 2024
ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను దోచుకున్న బీఆర్ఎస్ ని బొంద పెట్టాలని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉంటే ఆయన ఈరోజు చేసిన ప్రచారం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కోసం చెట్టు ఎక్కి ప్రచారం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. పలువురు పిచ్చి బాగా ముదిరింది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.