ఈరోజుల్లో అధిక బరువు అనేది ఒక సమస్యగా మారింది.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువుతో ఇబ్బంది పడతారు..మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడే వారు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువును తగ్గించే రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు..అలా బాధపడేవారికి అదిరిపోయే చిట్కా ఒకటి ఉంది దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం..
బరువు తగ్గించడంలో కీరదోస మరియు అల్లం మనకు ఎంతగానో దోహదపడతాయి. అల్లం మరియు కీరదోస మనకు సులభంగా లభించేవే. అలాగే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి..అల్లాన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. అలాగే కీరదోస కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే దీనిలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా కీరదోస కూడా మనకు సహాయపడుతుంది. అల్లం, కీరదోసతో మనం జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ముందుగా కీరదోసపై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి.. ఒక గ్లాస్ నీళ్లు పోసి గ్రేయిండ్ చెయ్యాలి..రుచి కొరకు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న జ్యాస్ ను రోజూ ఉదయం పరగడుపున తాగాలి. పరగడుపున కుదరని వారు అల్పాహారానికి అర గంట ముందు అయినా దీనిని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది…