జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆ దిశ గా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలు కూడా BRS ప్రవేశపెడతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు.
ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో ఈనెల 24వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఔరంగాబాద్‌లోని అంఖాస్ మైదానంలో బహిరంగ సభ జరపడం వీలుకాదని పోలీసులు స్పష్టం చేశారు. సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని మిలింద్ కాలేజీకి దగ్గరలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని సూచించగా.. అందుకు సీఎం కేసీఆర్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
దీంతో సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అదే రోజున సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం కొత్తగా వేరే ప్రాంతాన్ని ఎంచుకోవాలని brs శ్రేణులకు సూచించారు. రంగంలోకి దిగిన brs praja ప్రతినిధులు ఔరంగాబాద్‌లోనే బిడ్ బైపాస్ రోడ్డు దగ్గరలో ఉన్న జంబిడా మైదానంలో సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్నందున.. దానికి అంఖాస్ మైదానం సరిపోదని, పార్కింగ్ స్థలం కూడా తగినంత లేదని అందువల్ల సభాస్థలిని జంబిడా మైదానానికి మార్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.