ఏపీ హై కోర్టు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌స్టిస్ చంద్రు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర హై కోర్టు పై మ‌ద్రాస్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి జ‌స్టిస్ చంద్రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ హై కోర్టు ప‌ని తీరు బాగ లేద‌ని అన్నారు. అంతే కాకుండా ఆంధ్ర ప్ర‌దేశ్ హై కోర్టు త‌న ప‌రిధి దాటి వ్య‌వ‌హ రిస్తుంద‌ని విమ‌ర్శించారు. ఏపీ హై కోర్టు వ‌ల్ల ప్ర‌భుత్వం శ‌త్రువు ల తో, ప్ర‌త్య‌ర్థుల తో చేయాల్సిన యుద్దం న్యాయ వ్య‌వ‌స్థ పై చేస్తుంద‌ని అన్నారు. అమ‌రావ‌తి భూ స్కామ్ లో ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట‌ర్ చేస్తే.. ఏపీ హై కోర్టు స్టే ఇచ్చింద‌ని అన్నారు.

కోర్టులు న్యాయం మాత్ర‌మే చాయాల‌ని అన్నారు. కానీ ఏపీ హై కోర్టు న్యాయం కాకండా ఇంకా ఎదో చేయ డానికి ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని అన్నారు. ఇదిలా ఉంద‌గా జ‌స్టీస్ చంద్రు సామాన్య పౌరుల‌కు న్యాయం విష‌యం లో అండ గా ఉంటాడు. ఈయ‌న జీవిత క‌థ ఆధారం గా ఇటీవ‌లే జై భీమ్ అనే సినిమా కూడా వ‌చ్చింది. అయితే అలాంటి వ్య‌క్తి ఆంధ్ర ప్ర‌దేశ్ హై కోర్టు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం అనేది ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news