దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం జరగాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సత్వర న్యాయం అనేది మహిళల భరోసాకు భద్రత ఇస్తోందని అన్నారు. తాజాగా ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సు ప్రారంభం అయింది. ఈ సదస్సు కి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థను రాజ్యాంగ పరిరక్షకులుగా పరిగణిస్తున్నారని, సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత పై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొందన్నారు. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠిన మైనటువంటి చట్టాలు ఉన్నాయని తెలిపారు. ప్రధానంగా 2019లో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని ప్రధాని మోడీ వెల్లడించారు. అత్యంత వేగంగా మహిళల కేసులు పరిష్కారం చేయడం కోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు ప్రధాని మోడీ.