వినాయక చవితి పండుగపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

-

2024 సంవత్సరంలో వినాయక చవితి పండుగ రానే వస్తుంది. సెప్టెంబర్ 7వ తేదీన హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి రోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ వాడవాడలా గణపతి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం కరీంనగర్ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గణేష్ మండప నిర్వాహకులు అందరూ నవరాత్రి దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉదాహరణకి తాను 30 ఏళ్లుగా నిత్యం భగవంతుడిని పూజిస్తున్నానని తెలిపారు. గణేష్ మండపాలకు అయ్యే కరెంటు ఖర్చును సైతం చెల్లిస్తున్నానని తెలిపారు బండి సంజయ్.

విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది మండప నిర్వహకులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. నిమర్జనం రోజు మాత్రమే కాకుండా తొమ్మిది రోజులపాటు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఇక హెల్త్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందామని.. కరీంనగర్ ని ఆదర్శంగా నిలుపుదామన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version