తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు.
స్థలం సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. కాగా, ఎమ్మెల్సీ కవిత జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.