హెచ్‌సీయూ భూ వివాదంపై నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
‘కేటీఆర్ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలే. హెచ్‌సీయూ భూములపై తుస్సుబాంబ్ పేల్చాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా చెత్త స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం డబ్బు తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వాన్ని ఏ విధంగా అభాసుపాలు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది’ అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.