బైడెన్ కమలని నేనే గెలిపించా, ట్రంప్‌ కి చెప్పినా వినట్లేదు : పాల్ కొత్త రచ్చ !

-

చాలా కాలంగా వార్తల్లో లేని కేఏ పాల్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు జోబైడెన్, కమలా హ్యారిస్ లని తానే గెలిపించానని చెబుతున్నాడు ఆయన. గతంలో అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికల్లో తన ఆశీర్వాదం పొందాక ట్రంప్ విజయం సాధించాడని ఆయన చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల సమయంలో తాను కీలకంగా వ్యవహరించానని, తన ప్రార్థనలు, ప్రయత్నాల ఫలితంగానే డెమోక్రటిక్ అభ్యర్థులైన జోబైడెన్, కమలా హ్యారిస్ లు గెలుపొందారని పాల్ చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగక యావత్ ప్రపంచానికి ట్రంప్ అనే ముప్పును తప్పించడానికి తాను చేసిన ప్రయత్నం ఇలా ఫలించిందని ఆయన పేర్కొన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా లైవ్ లోకి వచ్చిన ఆయన ఎన్నికల ఫలితాలపై ట్రంప్ మంకుపట్టు పట్టడంతో రిపబ్లికన్ పార్టీ చీలిపోయిందని ఈ విషయంలో ట్రంప్ మనసు మారేలా ప్రార్థనలు చేయాలంటూ వైట్ హౌజ్ నుంచి అనేక మంది కీలక అధికారులు ఫోన్లు చేస్తున్నారని పాల్ చెప్పుకొచ్చారు. ట్రంప్ కనీసం భార్య మాట కూడా వినట్లేదని అమెరికా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ దిగిపోవడానికి అంగీకరిస్తానని చెబితే వైట్ హౌజ్ లోకి వెళ్లి, ట్రంప్ కోసం ప్రార్థన చేస్తానని షరతు పెట్టానని ఆయన చెబుతున్నారు. ట్రంప్ నా మట కూడా వినడం లేదని కేఏ పాల్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news