ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి చాలా జాగ్రత్తలు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే చోట్ల తిరగకూడదని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేస్తున్నాయి. వైరస్ ఎక్కువగా ఉండే దేశాల్లో అయితే ప్రజల ఇంటి నుండి బయటకు వస్తే అరెస్టు చేస్తామని కూడా డేంజర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది.
“దేశంలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతోంది. బాధితులకు నా వంతు సాయం చేసేందుకు సిద్ధం. మా సంస్థలకు సంగారెడ్డి లో 300 పడకల గదులు విశాఖపట్నంలో 100 పడకల గదులు గల చారిటీ సిటిస్ ఉన్నాయి. వాటిని తెలుగు ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు. ఇందుకు డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వాడుకోవచ్చు” అంటూ ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు. ఇలాంటి సాయం మహేష్ మరియు పవన్ అలాగే అధికారంలో ఉన్న జగన్ కూడా చేయలేదని తాజాగా కె.ఎ.పాల్ ఇచ్చిన సందేశం పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.