బ్రహ్మంగారి మఠంలో ఫైటింగ్.. కేసు నమోదు

-

కడప: బ్రహ్మంగారి మఠంలో వివాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల్లో ఆధిపత్య పోరు ముదిరింది. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణించడంతో పెద్ద భార్య, రెండో భార్య కుమారులు పిఠాధిపతి కావాలని పట్టుబట్టారు. దీంతో వివాదం ముదిరి ప్రభుత్వం వరకు వెళ్లింది. దీంతో  ప్రభుత్వం కమిటీ వేసింది. 20 నుంచి 25 మంది పీఠాధితులు వివిధ సంఘాలతో భేటీ అయి అభిప్రాయాలను తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశ్వబ్రాహ్మణ సంఘాలు, స్థానికులకు మధ్య గొడవి జరిగింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్‌పై దాడికి యత్నం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంకు శీను, దీప్తి రమణారెడ్డి, బాబ్జి, శ్రీరాములు, నారాయణ రెడ్డి అనే వ్యక్తులు శ్రీకాంత్‌పై దాడికి పాల్పడినట్టు గుర్తించి వారిపై పోలీసులు 452, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news