నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగలనుంది. ముందు నుంచి ఇక్కడ టికెట్ ఆశిస్తున్న కడారి అంజయ్య యాదవ్ కేసీఆర్ ను కలవనున్నారు అని తెలుస్తోంది. ఆయన పార్టీ వీడి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చివరి నిముషంలో బీజేపీ జానారెడ్డి అనుచరుడు అయిన రవికుమార్ నాయక్ కు టికెట్ ప్రకటించింది. దీంతో కడారి అంజయ్య యాదవ్ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది.
ఆయనకు ముగ్గురు ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్ళారని తెలుస్తోంది. దీంతో ఆయన కేసీఆర్ ను కలిసేందుకు వెళుతున్నట్టు చెబుతున్నారు. ఆయన ఈ సమయంలో కనుక బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరితే అది ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక నాగార్జునసాగర్ కి అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, బీజేపీ నుంచి రవికుమార్ నాయక్ లు నామినేషన్ వేశారు.