దళిత, గిరిజన ఆదివాసుల కోసం కొత్త రాజ్యాంగము రచించాలని కెసిఆర్ ఆలోచన అని.. రాజ్యాంగం అమలలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్…బీజేపీ బ్రష్టు పట్టిస్తున్నాయి అని టిఆర్ఎస్ ఆలోచన అని క్లారిటీ ఇచ్చారు కడియం శ్రీహరి. పేదల హక్కుల కాపాడాలి అంటే రాజ్యాంగం మళ్లీ రాచించాలని అన్నారని.. అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. అసలు సిసలైన అంబేద్కర్ వారసులం తామని.. బీజేపీ వాళ్లు గాడ్సే వారసులు అని మండిపడ్డారు.
అంబేద్కర్ ను ఎన్నడూ బీజేపీ గౌరవించ లేదన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ అనుకూలంగా సవరణ లు చేసుకుందని.. కెసిఆర్ ఏదో తప్పు మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారని అగ్రహించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బైబిల్ లాంటిదని.. అలాంటి రాజ్యాంగం కి అనేక సవరణలు చేసుకున్నామని చెప్పారు. కొత్త ప్రతిపాదనలు చేశారు.. ఇప్పుడు మరికొన్ని ప్రతిపాదనలు యాడ్ చేయాలి అనేది ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. మీకు దమ్ముంటే దేశ వ్యాప్తంగా దళిత బందు పెట్టండి రా అని సవాల్ విసిరారు. చిల్లర మాటలు మాట్లాడకండి.. విభజన చేట్టం లో హామీలు ఇచ్చారా ? అని నిలదీశారు. మెడికల్ కాలేజీ ఇచ్చారా ? చేతగాని సన్నాసులు మీరు అంటూ బిజేపి పై ఫైర్ అయ్యారు.