పల్నాడులో వైద్యం వికటించి బాలింత మృతి..!

-

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాకి చెందిన జల్ల ఈదమ్మ(25) కాన్పు కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు ఉదయం ఏడు గంటలకు వచ్చింది. వైద్యులు ఈదమ్మను పరీక్షించి నార్మల్ డెలివరీ చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి తెలియజేశారు. వైద్య సిబ్బంది రక్తం శాతం తక్కువగా ఉండటంతో ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఎక్కిస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మృత్యువాత పడింది.

అయితే మృతురాలికి ఇది నాలుగవ కాన్పు. గిరిజన మహిళ కాన్పు కోసం వచ్చి డెలివరీ అనంతరం మృతి చెందడం ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తమ కూతురు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాల దగ్గర భారీగా చేరుకున్నారు మృతురాలి బంధువులు. దీనిపై హాస్పిటల్ సూపర్నెంట్ ఉదయభాను స్పందిస్తూ సకాలంలో పూర్తి వైద్యం అందించాము కానీ మహిళకు రక్తం శాతం తక్కువగా ఉండడంతో ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్లు ఎక్కిస్తుండగా వైద్యం వికటించి మృతి చెందిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version