బడ్జెట్ పై బహిరంగ చర్చకు రావాలని సీఎం చంద్రబాబు తో సహా మంత్రులకు సవాల్ చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అవకాశం లేనేలేదు. అందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనం. యనమల రామకృష్ణుడు మతి భ్రమించి మాట్లాడారు. రూ. 6లక్షల 46వేల కోట్లు అప్పు వుందని మీరు ఇచ్చిన డాక్యుమెంట్ లోనే ఉంది. కానీ రూ.10 లక్షల కోట్ల మేర అప్పులు ఉన్నాయని బయట చెబుతారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం తెలీయకుండా యనమల రామకృష్ణుడు మాట్లాడటం హాస్యాస్పదం.
మా ప్రభుత్వం లో క్యాపిటల్ ఔట్ లే ఆగిపోయిందని అంటున్నారు. పచ్చి అబద్ధాలు చెప్పడం టీడీపీకి అలవాటైపోయింది. ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడే మాటలు ఇవేనా అని ప్రశ్నినించారు. అలాగే చంద్రబాబు హయాంలో 4.47 శాతంగా ఉన్న ఉన్న వృద్ధి రేటు.. జగన్ ప్రభుత్వం లో 4. 83 శాతం అయింది. జగన్ ప్రభుత్వం లో రూ. 80 వేల 454 కోట్ల పెట్టుబడులతో చేపట్టిన పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడానికే జగన్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు. చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వంలోనే ఆర్థిక వ్యవస్థ సమర్దవంతంగా పనిచేసింది అని కాకాణి పేర్కొన్నారు.