బాల్క ఓ చిల్లరగాడు.. కడియం శ్రీహరి సీరియస్

-

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీరియస్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ బాల్క సుమన్ ఒక చిల్లర గాడు అని ఘాటు విమర్శలు చేసారు. చిల్లర గాళ్ళ మాటలకి సమాధానం చెప్పక్కర్లేదని సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అంతా తనని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణలో కరువుకి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు అని అన్నారు. ఏం మాట్లాడాలో తెలియక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం అని అన్నారు బీఆర్ఎస్ నేతలు తన మీద చూసిన ఆరోపణలని రుజువు చేయాలని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news