BREAKING : రేపు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

-

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఇవాళ కన్నుమూశారు. ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు కైకాల. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. ఇవాళ మృతి చెందారు. ఇక సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ పట్ల పలుగురు సంతాపం తెలిపారు.

‘కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని… కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారని బాలయ్య ట్వీట్‌ చేశారు. అటు చిరంజీవి, చంద్రబాబు, బీజేపీ నేతలు కూడా స్పందిచారు. ఇది ఇలా ఉండగా, సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి. రేపు మహాప్రస్థానంలో ఉదయం 10 గంటల సమయంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news