బిగ్ బాస్ 6 ద్వారా రోహిత్ కి లభించింది అంతేనా..?

-

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో బాగా పాపులారిటీ దక్కించుకున్న షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో 6 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇందులో సాదాసీదాగా వచ్చి ఫైనలిస్టుగా నిలిచిన రోహిత్ అందరి మనసులు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన బిగ్బాస్ 6 నుంచి ఎంత పారితోషకం అందుకున్నాడు అనే వార్త వైరల్ గా మారింది.

ఆరో సీజన్ కు కంటెస్టెంట్ గా ఎంపికైన వారిలో ఎక్కువమంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా 21 మంది కంటెస్టెంట్లలో మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నిలు మాత్రమే జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఆరో సీజన్లోకి జంటగా ఎంట్రీ ఇచ్చిన వీరు కొన్ని వారాలపాటు ఒకే కంటెస్టెంట్గా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరిని విడదీసి వేరు వేరు ఇంటి సభ్యులుగా మార్చారు. అప్పటినుంచి తమదైన శైలిలో గేమ్ ఆడుతూ వచ్చారు. జంటగా వచ్చినా కూడా ఇద్దరూ ఓవర్ యాక్టింగ్ చేయకుండానే.. గొడవలు పడకుండానే ప్రేక్షకులను అలరించారు.

మెరీనా వెళ్ళిపోయిన తర్వాత తన ఆటతీరుతో మరింత మెప్పించిన రోహిత్ ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బ తినకుండా వారికి అనుగుణంగా ఆట ఆడుతూ మరింత పేరు సంపాదించుకున్నారు. ఎవరు ఊహించని విధంగా టాప్ ఫైనలిస్ట్ కి చేరుకొని ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు హీరో నిఖిల్ అతడిని ఎలిమినేట్ చేయగా నాగ్ మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక 15 వారాలపాటు హౌస్ లో ఉన్న రోహిత్ కు ఎంత పారితోషకం లభించింది అంటే 15 వారాలకి గాను రూ.6.75 లక్షలు మాత్రమే లభించిందట. వారానికి రూ. 45,000 చొప్పున 15 వారాలకు గానూ రూ. 6.75 లక్షలు లభించిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news