సినిమాల ద్వారా కాజల్ సంపాదించింది.. అక్షరాల అన్ని కోట్లా..?

-

తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో కాజల్ మాత్రమే కాదు సింధుతులాని , నవదీప్, శివబాలాజీ తదితరులు మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు.. అలాగే ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతం కిచ్లు ను ప్రేమించి వివాహం చేసుకుంది . ఇక వీరు నీల్ కిచ్లూ అనే ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈమె సినీ కెరీర్ లో సీనియర్ హీరోలతో మాత్రమే కాకుండా కుర్ర హీరోలతో కూడా నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది . ఇక 15 సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది కాజల్ అగర్వాల్.

ఇకపోతే ఈ క్రమంలోనే సినిమాల ద్వారా ఎన్ని కోట్లు కూడబెట్టింది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాజల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు అన్ని కలిపి సుమారుగారూ. 100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ రేంజిలో ఆస్తులను కూడా పెట్టడం అనేది కేవలం హిందీ హీరోయిన్ లకు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ కాజల్ కూడా 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టినా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. కాజల్ అగర్వాల్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన కెరీర్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

2020 లో వివాహం చేసుకున్న ఈమె సంసార జీవితాన్ని కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటించడానికి సిద్ధం అవుతోంది. ఇకపోతే మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తొలి సారి తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version