నేడు టీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీ.

నేడు టీఆర్ఎస్ పార్టీ కీలక భేటికి పిలుపు నిచ్చింది. టీఆర్ఎస్ పార్టీ శాననసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగబోతోంది. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ పార్టీని గట్టిగా ఎదుర్కొనేందకు  పార్టీ నేతకలు దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది. దీనిపై టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో భవి ష్యత్‌ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ వైఖరితో పాటు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా, ఢీల్లీ స్థాయిలోను ఆందోళనలను ఏ రూపంలో కొనసాగించాలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

ఇప్పటికే వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఈనెల12 ధర్నా నిర్వహించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో.. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈధర్నాలో పాల్గొని రైతులకు మద్దతునిచ్చారు. దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.