సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్స్ ఆఫీస్ వద్ద వీర విజృంభణ చేస్తోంది. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించి రజినీకాంత్ మాటను నిలబెట్టుకున్నాడు. ఇంకా థియేటర్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ వసూళ్లను పెంచుకుంటూ పోతోంది. ఇక ఈ సినిమాకు ఊహించదం కంటే అధికంగా లాభాలు రావడం వలన ఈ సినిమాను నిర్మించిన కళానిధి మారన్ దర్శకుడికి ఒక అద్భుతమైన గిఫ్ట్ ను ఇచ్చాడు. ఈ రోజు కళానిధి మారన్ స్వయంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు రూ. 1 .44 కోట్లు విలువ చేసే ఫొర్చె మాసన్ S కారును బహుమతిగా అందచేశారు. ఇక ఈ సక్సెస్ కు కారణం అయిన హీరో రజినీకాంత్ కు కూడా BMW కారును బహుమతిగా ఇచ్చారు. దీనితో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన గత చిత్రం బీస్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో ఈ సినిమాపై చాలా సందేహాలు ఉండేవి. కానీ ఈ సినిమా మాత్రమే ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది.