బీఆర్ఎస్ దోపిడీ విధానానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయింది : ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

-

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కానీ, అంతకుముందే 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా రూ.38 వేల కోట్ల అంచనాతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ గుర్తు చేశారు.

అలాంటి ప్రాజెక్టును కేసీఆర్‌ పక్కకు నెట్టారని,తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని ప్రాజెక్టు డిజైన్‌ మార్చేశారని, కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఢీల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయని భావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా పెరగలేదు. 5 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం 65 టీఎంసీలు ఎత్తిపోశారు. సంవత్సరానికి సగటున కేవలం 13 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు అని వెల్లడించారు.కాళేశ్వరం అన్ని పంపులు నడిస్తే కరెంటు బిల్లు రూ.13వేల కోట్లు అవుతుంది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. కరెంట్ బిల్లు రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశారు అని అన్నారు. అప్పటికీ మేడిగడ్డ పియర్స్‌ 5 ఫీట్లు కుంగాయి. బీఆర్ఎస్ దోపిడీ విధానానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని ఉత్తమ్‌కుమార్‌ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version