భారీ ధరలకు కల్కి డిజిటల్ రైట్స్.. షాక్ లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి తాజాగా ఒక వార్త నెట్టింట్లా వైరల్ గా మారింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను కోసం మూవీ మేకర్స్ రూ.200 కోట్లకి పైగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం రూ.150 కోట్లు-రూ.170 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం 200 కోట్ల రూపాయల వరకు ఆశిస్తున్నట్లు సమాచారం.ఇలా ఈ చిత్రం డిజిటల్ హక్కులకు ఇంత డిమాండ్ ఉండడంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ నెట్ ఫ్లిక్స్ షాక్ చెందాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news