వసూళ్ల వర్షం కురిపిస్తున్న కల్కి మూవీ.. మూడో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ చిత్రం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇక విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది.

కల్కి మూవీ రిలీజైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు, రెండో రోజు రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్రబృందం ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేలా ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news