వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బిజెపిపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్ వేదికగా సెటైర్లు విసిరారు. ” తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు” అంటూ కవిత ట్విట్ చేశారు. షర్మిల – బిజెపి ఒకటేనని ఉద్దేశిస్తూ కవిత ఈ ట్వీట్ చేశారు.
అయితే నర్సంపేటలో టిఆర్ఎస్ లీడర్ల దాడి ఘటనకు నిరసనగా షర్మిల నిన్న ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు షర్మిలని అడ్డుకొని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే షర్మిల అరెస్టును పలువురు నేతలు ఖండించారు. తన పోరాటానికి మద్దతు తెలిపిన వారికి షర్మిల కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
” పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దాడులకు పాల్పడినప్పుడు, పార్టీలకు అతీతంగా నిలదీయడం అందరి కర్తవ్యం. నా పోరాటానికి మద్దతు తెలిపి, ప్రభుత్వ దాడిని ఖండించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖ లకు ధన్యవాదాలు” అని షర్మిల ట్వీట్ చేశారు.
తాము వదిలిన “బాణం”
తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022