కళ్యాణ్ రామ్” బింబిసార” మేకింగ్ వీడియో రిలీజ్

-

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 11వ రోజున 1.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా కోసం జరుగుతున్న సెట్ నిర్మాణం.. డాన్సులు, ఫైట్ కంపోజ్ చేస్తున్న సన్నివేశాలకి సంబంధించిన షార్ట్స్ పై మేకింగ్ వీడియోని వదిలారు. ఈ మేకింగ్ వీడియోలో కళ్యాణ్ రామ్ డెడికేషన్ కి అభిమానులు ఫీదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version