‘కళ్యాణీ వచ్చా వచ్చా’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల

-

పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి ‘కళ్యాణీ వచ్చా వచ్చా’ అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. విజయ్, మృణాల్ అప్పియరెన్స్ ఆకట్టుకుంటోంది.ఇదివరకే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ , ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు 100 కోట్ల క్లబ్బులో చేరిన పలు చిత్రాలను తెరకెక్కించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news