ట్రంప్‌కు క‌మ‌ల ఎఫెక్ట్‌: భార‌తీయ ఓట్లు గ‌ల్లంతే..!

0
238

రాజ‌కీయాలు ఎక్క‌డైనా ఒక్క‌టే! భార‌త్ అయినా.. అగ్ర‌రాజ్యం అమెరికా అయినా.. సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒక‌ప్పుడు ఏ సెంటిమెంటుతో అయితే.. డొనాల్డ్ ట్రంప్ అగ్ర‌రాజ్య అధ్య‌క్ష పీఠాన్ని ద‌క్కించుకున్నారో.. ఇప్పుడు అదే ట్రంప్‌కు.. అదే సెంటిమెంట్‌తీవ్రంగా అడ్డు వ‌స్తోంది. అది కూడా ఓ మ‌హిళ రూపంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో త‌న‌పై పోటీకి దిగిన హిల్ల‌రీ క్లింట‌న్‌పై తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డిన ట్రంప్‌.. స్థానిక‌త‌ను రెచ్చ‌గొట్టి తన ప‌బ్బం గ‌డుపుకొన్నారు. అయితే, ఇప్పుడు ట్రంప్‌కు ప్ర‌త్య‌ర్థిగా డెమొక్రాటిక్ త‌ర‌ఫున జో బెడెన్ రంగంలోకి దిగారు. ఈయ‌న వివాద ర‌హితుడు. పైగా అమెరిక‌న్ ప‌క్ష‌పాతి. అంతేకాదు, స‌మ‌కాలీన వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల‌, ప్ర‌పంచ దేశాల విధివిధానాల ప‌ట్ల పూర్తిగా అవ‌గాహ‌న ఉన్న సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.

ఇక‌, బైడెన్ ఇటీవ‌ల నామినేట్ చేసిన ఉపాధ్య‌క్ష రేసులో క‌మ‌లా హ్యారిస్ పేరు ఇప్పుడు ట్రంప్‌కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఎవ‌రి ఓట్ల‌పై అయితే, ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారో.. వారి ఓట్ల‌కే ఇప్పుడు హ్యారిస్ ఎస‌రు పెట్టారు. అమెరికాలో దాదాపు 30 శాతం ఓట్లు భార‌తీయుల‌వే. అమెరికాలో స్థిర‌ప‌డిన భారతీయులు అక్క‌డ అధ్య‌క్షుడిని నిర్ణ‌యించేస్థాయిలో ఈ ఏడాది న‌వంబ‌రులో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో నిలిచారు. ఈ నేప‌థ్యంలోనే ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర ఎంత ఈ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్య‌మిచ్చారో.. ఇంత‌కు వంద రెట్లు అమెరికాలో భారీ ఎత్తున బ‌హిరంత స్క్రీన్లు ఏర్పాటు చేసి.. భార‌త ప్ర‌ధానితో త‌న‌కు ఉన్న మిత్ర‌త్వాన్ని చాటుకునేందుకు ట్రంప్ త‌హ‌త‌హ‌లాడారు.

త‌ద్వారా అమెరికాలోని భారతీయుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ట్రంప్ శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు చేశారు. త‌ర్వాత భార‌త్ నుంచి తిరిగి వెళ్లాక కూడా అమెరికాలో నిర్వ‌హించిన అనేక ర్యాలీలు, ఎన్నిక‌ల ప్ర‌చారాల్లో .. భార‌తీయుల‌పై ట్రంప్ ప్రశంస‌లు జ‌ల్లు కురిపించారు. ఏ ప్ర‌శంస అయినా.. సెంటిమెంటు రూపంలో ఆయ‌న అమెరికాలోని భారతీయుల ఓట్ల‌ను కొల్ల‌గొట్ట‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు ఉపాధ్య‌క్షురాలి రేసులో ఉన్న డెమొక్రాటిక్ అభ్యర్థి క‌మ‌లా హ్యారిస్ ఏకంగా ఓ భార‌తీయ ఇండియ‌న్‌. త‌మిళ‌నాడుకు చెందిన కుటుంబానికి ఆమె వార‌సురాలు.

అంతేకాదు, ఆమె ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి నిలిచిన దగ్గ‌ర నుంచి నిత్యం భారతీయుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు చేస్తున్న ప్ర‌యత్నాలు ఫ‌లిస్తున్నాయి. దీంతో ట్రంప్ ఎవ‌రిపై అయితే, సెంటిమెంట్ పెట్టుకున్నారో.. అదే భార‌తీయులు క‌మ‌ల‌వైపు మొగ్గుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. ట్రంప్ అధ్య‌క్ష పీఠాన్ని వ‌దులుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.