ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కామారెడ్డి వరదల్లో మునిగిందని బాంబు పేల్చారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. వరదల వల్ల ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతాయి. దానికి మమ్మల్ని బాధ్యులని చేస్తాం అంటే ఎట్లా ? అని నిలదీశారు.

ఓటు వేసినందుకు ముడ్డి కడగాలి అంటే కుదరదని ఫైర్ అయ్యారు. వరదల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను కానీ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదని మండిపడ్డారు. కామారెడ్డి లో మూడు గంటల్లో కుండ పోత వర్షం కురిసింది ..జల విలయం సంభవించిందన్నారు.
ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టు ప్రక్కల చెరువులు అలుగు పారాయి..కట్టలు తెగిపోయాయని పేర్కొన్నారు. ఊహించని నష్టం వాటిల్లింది… వర్షాల్లో అధికారులంతా ఫీల్డ్ లో ఉండి కష్టపడి పనిచేశారన్నారు. అధికార యంత్రాంగం పనిచేయలేదు అనటం సరైంది కాదు.. కొంత మంది సోషల్ వీడియో లో ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారని ఆగ్రహించారు.