కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజల సమస్యలను ఫిర్యాదు పెట్టెలో వేయాలని సూచించారు. వారానికి ఒకరోజు ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తీసుకోని నిర్ణయం ఆయన తీసుకోవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గతంలో కలెక్టర్లు, ఎస్పీలు సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి ఫిర్యాదు పెట్టెలు పెట్టి సమస్యలు పరిష్కరించేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కూడా అదే పద్ధతిని అనుసరించారు.
గతేడాధి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ,రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి లను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.