వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ పోస్ట్ పోన్ …. విడుదల అయ్యేది అప్పుడే!

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.   మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,హిందీ భాషలలో విడుదల కావాల్సి ఉంది.

అయితే సోలో రిలీజ్ డేట్ సర్దుబాట్లలో భాగంగా ఫిబ్రవరి 16 న ఊరు పేరు భైరవకోన మూవీ విడుదలకి రెడీ అవుతోంది. ఈ నేపద్యంలో ఫిలిం ఛాంబర్ సంప్రదింపులు జరిపిన క్రమంలో ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం పోస్ట్ పోన్ అయింది.ఈ సినిమాని రెండు వారాలు వెనక్కి జరిపి మార్చి 1వ తేదీన విడుదల చేస్తున్నామని చెబుతూ అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది. ఒక రకంగా చెప్పాలంటే వరుణ్ తేజ్ కి ఇది సోలో రిలీజ్ గానే ఉంటుంది. అది కొంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news