గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కృష్ణా యాజమాన్య బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ కృష్ణా జలాలకు సంబంధించి జారీ చేసిన జీవోకి షాక్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ముందుకు వెళ్లద్దని ఏపి ప్రభుత్వానికి కృష్ణా వాటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజక్టులు చేపట్టాలంటే తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఆ నివేదిక ను కేంద్ర కేంద్ర జల సంఘం , అపెక్స్ కౌన్సిల్ పరిశీలన కు పంపుతామని స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాద్ దాస్ కు కృష్ణా వాటర్ బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీన లేఖ రాసారు.