మీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి: కందుల దుర్గేష్

-

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రభుత్వ నియంతృత్వ విధానాల వల్ల పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడిందని అన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగించేలా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ప్రభుత్వం పని చేస్తోంది అని అన్నారు. పనికిరాని సాంకేతిక కారణాల లోపాలు చూపుతూ అనుమతులు నిరాకరిస్తున్నారు అని అన్నారు.

మీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి అని కందుల దుర్గేష్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రైతులు అప్పులపాలు అవుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నారు అని అన్నారు. ఈ ప్రభుత్వం ఏ రంగంలోనూ అభివృద్ధి సాధించలేదు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు వ్యక్తిగత దూషణలు చేయరు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version