అయాన్‌ ముఖర్జీ, కరణ్​జోహార్​లపై కంగనా కామెంట్స్​

-

ఇతిహాసాల ఆధారంగా భారీ తారాగణంతో మూడు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కలిసి నటించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోన్న ఈ చిత్రంపై నటి కంగనా రనౌత్ స్పందించారు. అసలు ఏం అన్నారంటే…

భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో రూపుదిద్దుకున్న బ్రహ్మాస్త్ర టీమ్‌పై నటి కంగనా రనౌత్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ చిత్రదర్శకుడు అయాన్‌ ముఖర్జీని మేధావి అంటూ మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని అన్నారు. బ్రహ్మాస్త్ర తెరకెక్కించడంలో ఆయన విఫలమయ్యాడని.. సినిమా అసలేం బాలేదని పేర్కొంటూ ఈ చిత్రానికి పలు మీడియా సంస్థలు ఇచ్చిన రేటింగ్స్‌ని ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

అయాన్‌ ముఖర్జీని జీనియస్‌ అంటూ మెచ్చుకున్న వారందర్నీ జైలులో పెట్టాలి. ‘బ్రహ్మాస్త్ర’ తెరకెక్కించడానికి అతడికి 12 ఏళ్లు పట్టింది. 12 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ని మార్చాడు. ప్రొడక్షన్‌ ఖర్చుల రూపంలో రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. ఇలాంటి వ్యక్తిని మేధావి అని పిలవడం హాస్యాస్పదంగా ఉంది. ఇక, కరణ్‌ జోహార్‌ తన సినిమా స్క్రిప్ట్‌లపై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్‌, కలెక్షన్స్‌ వివరాలు.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి తన సినిమాలకు ఇప్పించుకుంటాడు.

ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం, టాలెంట్‌ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులు, రచయితల్ని కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్‌తో సినిమాలు చేస్తే సరిపోతుంది కదా’’ అని కంగన రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news