డబ్బు , కెరీర్ కోసం పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది : కంగనా రనౌత్

-

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగే స్వభావం కలిగినది అని అందరికీ తెలిసిందే. ఈమె చేసిన వ్యాఖ్యలు లేదా చేసిన పోస్టింగ్ ల వలన చాలా వివాదాలలో చిక్కుకుంది. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక జంట గురించి ఇండైరెక్ట్ గా కొన్ని పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కంగనా రనౌత్… ఈ పోస్ట్ లో ఒక జంట బయట మాత్రం కలిసి ఉన్నట్లు నటిస్తూ పర్సనల్ గా వేరు వేరుగా జీవిస్తున్నారు అని అర్ధం వచ్చేలా పోస్ట్ చేసింది. అయితే తెలుస్తున్న ప్రకారం ఈమె అలియా భట్ మరియు రణ్ బీర్ కపూర్ లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందని చాలా మందికి తెలుసు. ఈమె ఈ పోస్ట్ లో ఇటీవల భర్త తన ఫామిలీ తో కలిసి లండన్ కు వెళ్లగా, భార్య మాత్రం ఇండియాలోనే తన కొడుకుతో ఉందంటూ చెప్పింది. కెరీర్ మరియు డబ్బు కోసం ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే ఇలాగే ఉంటుందంటూ మాట్లాడింది.

భర్త ఈమెను ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, మాఫియా డాడీ ఒత్తిడి చేయడం వలెనే అతను పెళ్లి చేసుకున్నదంటూ సంచలన విషయం బయట పెట్టింది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు విడిపోదామా అని ఎదురుచూస్తున్నది కంగనా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news