NDA … INDIA ను ఛాలెంజ్ చేయగలరా ? : మమతా బెనర్జీ

-

ఈ రోజు బెంగుళూరు లో ముగిసిన రెండు రోజుల విపక్షాల సమావేశంలో కీలక నేతలు కొత్తగా ఏర్పడిన INDIA విపక్షాల కూటమి గురించి మాట్లాడారు. ఇక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి కీలక విమర్శలు చేసింది. బీజేపీ బారి నుండి దేశాన్ని రక్షించడానికి ఈ మా కూటమి కీలకంగా పనిచేస్తుందన్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాము అని మమతా పేర్కొన్నారు. దేశంలో పాలనలో ఉన్న బీజేపీ మరియు NDA నేతలు INDIA ను ఛాలెంజ్ చేయగలరా అంటూ ఈమె బహిరంగంగా ప్రశ్నించారు. మా కూటమీలో ఉన్న వారంతా రైతులు, విద్యార్థులు, దళితులు ఉన్నారని మమతా అన్నారు.

 

రానున్న రోజుల్లో బీజేపీ తో యుద్ధం చేయనున్న INDIA కూటమి తప్పకుండా గెలుస్తుందన్న ఆశాభావాన్ని మమతా బెనర్జీ వ్యక్తం చేసింది. దేశ ప్రజలు బీజేపీ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని మరోసారి మమతా బెనర్జీ గుర్తు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news