హైదరాబాద్ చేరుకున్న కంగనా.. పది రోజులు ఇక్కడే !

-

నటి కంగనా రనౌత్ హైదరాబాద్ చేరుకున్నారు. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు కంగనా రనౌత్ వచ్చినట్టు తెలుస్తోంది. పది రోజుల పాటు హైదరాబాద్ లో షూటింగ్ లో కంగనా రనౌత్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అయితే కంగనా రనౌత్ రాక గురించి అధికారులు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కంగనా రనౌత్ వై కేటగిరి సెక్యూరిటీ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తెలంగాణ అధికారులు ఆమెకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. పది రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలోనే కంగనా రనౌత్ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక కంగనా రనౌత్ కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య తర్వాత కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version