నారా లోకేష్ దమ్ముంటే నాతో చర్చకు రావాలని సవాల్ చేశారు వైసీపీ ఎమ్యెల్యే కంగాటి శ్రీదేవి. టిడిపి నాయకుడు లోకేష్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. లోకేష్ కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని శ్రీదేవి తాజాగా సవాల్ విసిరారు.
తాను దళితుల భూములు ఆక్రమించుకున్నానని, ఆయన విడుదల చేసిన ఆధారాలన్ని ఫేక్ అని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.